Search
Monday 23 July 2018
  • :
  • :

బోయపాటికి చరణ్ సలహా

charan

తన కెరీర్ బెస్ట్ హిట్ మూవీ ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్… బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్న బోయపాటి, చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై  చరణ్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రం కథతోపాటు నిర్మాణ వ్యయం విషయంలో కూడా అతను జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమా బడ్జెట్‌ను కొంచెం తగ్గించాలని బోయపాటికి చరణ్ సలహా ఇచ్చాడట. తన సినిమాల్లో భారీతనం కనిపించేందుకు బోయపాటి ఖర్చుకు వెనుకాడడు. ఇక ఈ సినిమాలో భారీ సెట్టింగ్స్‌తో పాటు విలన్ ఇంట్రడక్షన్ సీన్ కోసం అతను  భారీగా ఖర్చు చేయించాడట. దీంతో చరణ్ బడ్జెట్ ఎక్కువ కాకుండా,  10 కోట్ల నిర్మాణ వ్యయం తగ్గేలా చూడాలని సలహా ఇచ్చాడట. బోయపాటి దీనికి ఓకే చెప్పినట్లు తెలిసింది.

Comments

comments