Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అక్టోబర్ నాటికి పూర్తి

Ramcharan Want to Act In Bollywood

సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. జూలై మొదటి వారంలో జార్జియా, యూరప్ దేశాల్లో రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే లొకేషన్స్‌కు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆ తర్వాత సినిమాలోని కొన్ని ఎమోషన్స్ సీన్స్‌ను కూడా పూర్తిచేసి ఇంకా ఏమైనా ప్యాచప్ పనులు మిగిలి ఉంటే వాటిని కూడా ముగించాలని అనుకుంటున్నారు. సినిమా షూటింగ్‌ను అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌కు సంబంధించిన పనులను అన్నింటినీ అప్పటి వరకు పూర్తిచేయాలని అనుకుంటున్నారు. తనకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా అక్టోబర్ నాటికి పూర్తయిపోవాలని చరణ్ ముందే చెప్పాడట. ఎందుకంటే రామ్‌చరణ్ ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో తారక్‌తో కలిసి నటించే మల్టీస్టారర్ షూటింగ్‌లో చేరతాడు. ఈ మల్టీస్టారర్ అప్పటికి సెట్స్‌పైకి వచ్చేస్తుంది. అందుకే బోయపాటి సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఇక బోయపాటి తన నెక్స్ సినిమాను బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఆ సినిమా కథను కూడా బోయపాటి ఇప్పుడే రాస్తుండడం విశేషం.

Comments

comments