Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సిబిఐ చెక్

chidambaram

చిదంబరం, కార్తీపై చార్జిషీట్ 

న్యూఢిల్లీ : ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో సిబిఐ గురువారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలపై అభియోగాలను దాఖలు చేసింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీట్‌లో తండ్రి కుమారులతో పాటు మరో 16 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో ప్రస్తుత, మాజీ ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఒపి సైనీ ఎదుట సిబిఐ తమ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. వీటిని ఈ నెల 31వ తేదీన పరిశీలించేందుకు సమయం ఖరారు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరం ఉన్న సమయంలో ఆయన పలుకుబడిని వినియోగించుకుని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నుంచి అనుమతులకు దిగారని, ఈ విధంగా కుమారుడికి ఇతరులకు లాభం దక్కేలా చేశారని ఇందులో రెండు దఫాలుగా డబ్బుల అక్రమలావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామని సిబిఐ తెలిపింది. 2 జి స్పెక్ట్రమ్ కేసుల పర్యవసానంగా ఎయిర్ సెల్ మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు తీవ్ర స్థాయి అభియోగాలు వెలువడ్డాయి. కార్తీ చిదంబరాన్ని ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా చేర్చారు. అనుబంధ ఛార్జీషీట్‌లో తిరిగి ఆయన పేరును ఇతరులు పేర్లను ప్రస్తావించారు.
కోర్టులో తేల్చుకుంటాం : చిదంబరం
తనపై ఛార్జీషీట్ దాఖలు చేయడం తెలివితక్కువతనం, అకారణం అని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. కేసు దాఖలుకు సిబిఐపై ఒత్తిడి వచ్చిందని, అందుకే తప్పుడు ఆరోపణలతో ఈ అనుబంధ ఛార్జీషీట్‌కు దిగారని చిదంబరం స్పందించారు. అయితే న్యాయస్థానంలో తాము ఈ అభియోగాలకు వ్యతిరేకంగా శక్తివంతంగా వాదిస్తామని, నిజం నిరూపించుకుంటామని సవాలు విసిరారు. తనపైనా , మచ్చలేని ప్రతిష్ట గల అధికారులపైనా ఛార్జీషీట్ దాఖలుకు ఒత్తిడి తీసుకువచ్చారని, దీనిని సరైన విధంగా తట్టుకుని చిత్తుచేస్తామని ప్రకటించారు.

Comments

comments