Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తప్పుడు ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతీస్తుంది

Charging charges against the authorities

అధికారులపై అసత్యపు ఆరోపణలు చేస్తుంది
కేసు కోర్టులో ఉండగా పాస్‌బుక్ ఇవ్వడం సాధ్యమా
ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం : తమ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లె గ్రామ భూ బాధితులు అవేదన వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని పాత్రికేయుల భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన పండగ నారాయణ, పండగ అర్జున్ సహా మరికొందరు మాట్లాడుతూ తన తండ్రీ గారైన పండుగ చిన నర్సయ్యకు సంబంధించిన భూమి సర్వేనంబర్ 9 (అ)లోని 14 గుంటలను, 9 (ఆ)లోని ఒక గుంట భూమిని కీర్తి తులసి అనే మహిళ తప్పుడు దారిలో రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నారు. వారసత్వంగా తమకు రావాల్సిన ఆస్తిని నర్సయ్య మతిస్థిమితం సక్రమంగా లేని సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నారు. తాము కోర్టుకు వెళ్ళగా ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉందన్నారు. కేసు కోర్టులో ఉండగా పాస్‌పుస్తకాలు జారీ చేయాలంటూ ఆమె అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుందని అదేలా సాధ్యమవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారుల మీద అసత్యపు ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. కీర్తి తులసి తమ మీద అదేవిధంగా స్థానిక ఆర్.ఐ బాలయ్య, విఆర్‌ఏ రాధాకృష్ణ మీద చేస్తున్న ఆరోపణల్లో ఏలాంటి సత్యం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో తనను అవమానించినట్లు తులసి చేస్తున్న ఆరోపణలో సైతం నిజం లేదన్నారు. పండుగ చిన నర్సయ్య వద్ద ఆమె భూమి కోనుగోలు  చేసినట్లు చెబుతున్న విషయం వాస్తవం కాదంటూ అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నారు. అందుకనే తాము కోర్టుకు వెళ్ళడం జరిగిందని పండుగ నారాయణ, పండుగ ఆర్జున్‌లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు.

Comments

comments