Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అసలు సిసలైన పొడుగు కాళ్ల సుందరి…

Chase-Kennedy

మాములుగా ఏ అమ్మాయి అయినా కొంచెం పొడుగుగా ఉంటే పొడుగు కాళ్ల సుందరి అని వ్యవహరించడం మనం విని ఉంటాం. అలాంటిది ఓ అమ్మాయికి ఏకంగా 4 అడుగుల(51 అంగుళాలు) పొడువు కాళ్లు ఉంటే ఏమనాలి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే 23 ఏళ్ల చేస్ కెనడీ అనే యువతికే ఈ పొడుగు కాళ్లు ఉన్నాయి. అయితే ఈ పొడుగు కాళ్ల సుందరి హైటు ఎంతో తెలుసా? 6 అడుగుల 5 అంగుళాలు.  ఇంతకుముందు హోలీబర్ట్ అనే మహిళ పేరిట పొడుగు కాళ్ల రికార్డు ఉండేది. ఆమె కాళ్ల పొడువు 49.5 అంగుళాలు.

Chase-Kennedy2

ఇక చేస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాగా ఎత్తుగానే ఉంటారట. తండ్రి 6 అడుగుల 7 అంగుళాలుంటే, తల్లి 5 అడుగుల 11 అంగుళాలు, ఇద్దరు సొదరులు 6.6, 6.7 అడుగుల ఎత్తు ఉంటారట. ఇక చేస్ ఎత్తుతో సరితుగే భర్త కూడా దొరికాడట. అతడి హైటు 6 అడుగుల 4 అంగుళాలు అంటే చేసే కంటే ఒక అంగుళం తక్కువన్నమాట. కెనడీ ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన పొడుగాటి కాళ్లతో సూపర్ మోడల్ గా దూసుకుపోతుందట. ఈ అసలు సిసలైన పొడుగు కాళ్ల సుందరిని మీరు చూడండి.

Related image

Comments

comments