Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వాట్ ఎ వండర్

Raman-singh_manatelangana copyమనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుండి ఇప్పటికే ఒప్పందం చేసుకున్న ప్రకారం తెలంగాణకు కరెంట్ తీసుకురావడానికి అవసరమైన విద్యుత్ లైన్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యే దిశగా పని చేయాలని తెలం గాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అభిప్రాయం వ్య క్తం చేశారు. అత్యంత గడ్డు పరిస్థితి నుంచి కోతలు లేని విద్యుత్ సరఫరా చేసే స్థితికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవడం సాధారణ విషయం కాదని, రాష్ట్రం ఏర్పడిన వెంటనే విద్యుత్ కోసం కె.చంద్ర శేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలను రమణ్‌సింగ్ ప్రశంసించారు. విద్యుత్ కోసం కెసిఆర్ తమ రాష్ట్రానికే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావుతో రమణ్‌సింగ్ సమావేశ మయ్యారు. ‘నేను హైదరాబాద్‌లో దిగగానే కారె క్కాను. కారు డ్రైవర్‌ను కరెంట్ గురించి అడిగాను. మీ రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఏమిటని ఆరా తీశా ను. మా రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు లేవు. ఇంతకు ముందు కరెంట్‌కు చాలా కష్టముండేది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కరెంట్ కష్టాలు పోయాయి అని డ్రైవర్ చెప్పాడు.

నేను చాలా సంతోషపడ్డాను. రోజుకు సగటున ఆరు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేని విద్యుత్ అందించడం మామూలు విషయం కాదు” అని రమణ్‌సింగ్ ముఖ్యమంత్రితో అన్నారు. భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళిక గురించి ఆయన సిఎంను అడిగి తెలుసుకున్నారు. హైడల్, సోలార్ విద్యుత్ పరిస్థితిని, ప్రణాళికలను కూడా ఆరా తీశారు. తెలంగాణలో సోలార్ రంగంలో 2700 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతరత్రా విషయాలను చర్చించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో చేప ట్టిన నయా రాయపూర్ నిర్మాణ పురోగతిని కూడా కెసిఅర్ రమణ్‌సింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పలు కార్యక్ర మాల గురించి రమణ్‌సింగ్ వివరాలు అడుగుతూ “మీరు బాగా చేస్తున్నారు. మీది రిచ్ స్టేట్ కూడా. మీలాగే మేము కూడా భవిష్యత్‌లో తయారవు తాం. మంచి కార్యక్రమాలు అమలు చేస్తాం” అన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ రమణ్ సింగ్‌ను దుశ్శాలువా, చార్మినార్ జ్ఞాపికతో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు కె.టి.రామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జి.జగదీష్‌రెడ్డి, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, దిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి, స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్రావు, సిఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments