Home తాజా వార్తలు బాలీవుడ్ హీరో హృతిక్ పై చీటింగ్ కేసు…

బాలీవుడ్ హీరో హృతిక్ పై చీటింగ్ కేసు…

cheating case against hrithik roshan

ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తోపాటు మరో 8 మందిపై చెన్నైపోలీసులు కేసు నమోదుచేశారు. మురళీధరన్ అనే ఓ స్టాకిస్ట్ ఫిర్యాదు మేరకు హృతిక్ పై చీటింగ్ కేసు పైల్ చేశారు. గుర్గావ్‌కు చెందిన ఓ సంస్థ హృతిక్ రోషన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్ బ్రాండ్ ఉత్పత్తులను మర్చండైజ్ చేయడానికి తనను స్టాకిస్ట్‌గా నియమించుకుందని, అయితే హృతిక్‌తోపాటు మరికొందరు తనకు రూ.21 లక్షలు ఇవ్వకుండా ముంచారని మురళీధరన్ తన ఫిర్యాదులో తెలిపాడు. సదరు గుర్గావ్ సంస్థ ఉత్పత్తులను సరిగా సరఫరా చేయలేదన్నాడు. తనకు తెలియకుండా మార్కెటింగ్ టీమ్‌ను కూడా తొలగించిందని బాధితుడు ఆరోపణ చేశాడు. దీనివల్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని, ఉన్న ఉత్పత్తులను తిప్పి పంపిస్తే వాటికి చెల్లించాల్సిన మొత్తం కూడా తనకు ఇవ్వలేదని చెబుతున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు హృతిక్ రోషన్‌తోపాటు మరో 8 మందిపై  సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశామని కొడంగయ్యూర్ పోలీసులు పేర్కొన్నారు.