Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులపై చీటింగ్ కేసు

flipkart

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌తో పాటు మరో ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యాపారవేత్తకు బన్సల్ సోదరులు రూ.9.96 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బెంగళూరులోని ఇందిరానగర్‌కు చెందిన సీ-స్టోర్ కంపెనీ ఆధారిత ఇందిరానగర్ యజమాని నవీన్ కుమార్ వీరిపై ఫిర్యాదు చేశారు. 12,500 ల్యాప్‌టాప్‌లకు సంబంధించి రూ.9.96 కోట్ల బకాయిలను చెల్లించకుండా తనను మోసం చేశారంటూ అతను ఆరోపించాడు. బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా నవీన్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని 2015 జూన్ నుంచి 2016 జాన్ వరకు 14,000 ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు సరఫరా చేశానని వెల్లడించాడు. 1,482 యూనిట్లను ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ చేసిందని, కానీ మిగతా యూనిట్లకు చెల్లింపులు చేయలేదని నవీన్ ఆరోపించాడు. వీటికి సంబంధించి టిడిఎస్, షిప్పింగ్ ఛార్జీలను కూడా చెల్లించలేదని అన్నాడు. బకాయిలను చెల్లించాలని అడిగితే, ఫ్లిప్‌కార్ట్ మరో 3,901 యూనిట్లను రిటర్న్ చేసిందని, కానీ బకాయిలను చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఇందిరానగర్ పోలీసులు బన్సల్ సోదరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ డైరెక్టర్, అకౌంట్ మేనేజర్లపైనా నవీన్ ఫిర్యాదు చేశాడు. దీనిపై బన్సల్ సోదరుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Comments

comments