Home తాజా వార్తలు పెట్రో‌ మాయగాళ్లు: జేబులకు చిల్లు

పెట్రో‌ మాయగాళ్లు: జేబులకు చిల్లు

Cheating In Petrol Bunks In Warangal District

వరంగల్‌: పెట్రోల్ ధరలు రోజురోజుకు చుక్కలనంటుతుంటే ఇది చాలదు అన్నట్లు పెట్రోల్‌ బంకుల మోసాలు సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధికారుల తనిఖీలు తూతూ మాత్రంగా సాగుతుంటే పెట్రో మాయగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. తమదైన శైలితో వరంగల్‌ అమాయకపు ప్రజల్ని విచ్చల విడిగా దోచేసుకుంటున్నారు. పెట్రోల్‌ కొలత పూర్తి కాకుండానే పంపు ఆపేయడం. వేగంగా ట్యాంకులు నింపడం అదే సమయంలో కొలతలు సూచించే ఎలక్ట్రానిక్‌ మిషన్‌పై చెయ్యి అడ్డుపెట్టడం, మిషన్‌ రీడింగ్‌లో తప్పులు మొదలైన మోసాలతో ఫిల్లింగ్‌ సిబ్బంది తమ చేతి వాటం చూపెడుతున్నారు.