Search
Wednesday 21 November 2018
  • :
  • :

మిరియాలతో అనారోగ్యానికి చెక్!

Check for illness with Peppermints

అడపాదడపా వర్షాలకు, చలికి ఈ సమయంలో జలుబు, దగ్గు మొదలైన అనారోగ్యాలు మనిషిని అలుముకుంటాయి. ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి. వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా కాపాడుకోవాలి. అందుకు సరైన నియమాలు పాటించాలి.

ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటూ ఆకలి కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి పని తీరు కూడా మందగిస్తుంది. ఈ రెండింటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం త్వరగా వస్తాయి. ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వండి, వేడిగా ఉన్నప్పుడు తినేందుకు ప్రయత్నించాలి. చల్లగా, నిల్వ ఉన్న పదార్థాలలో హానికరమైన సూక్ష్మజీవులు పెరిగి అనారోగ్యానికి కారణమవుతాయి. మాంసాహారం అయితే తొందరగా పాడవుతుంది. అందుకే ఈ సీజన్‌లో వీలైనంత తక్కువగా మాంసాహారాన్ని తీసుకోవాలి. దుంపలూ, ఆకుకూరల్ని కూడా చాలా తక్కువగా తినడానికి ప్రయత్నించండి. వంటింట్లో ఉండే మిరియాలతో అనారోగ్యానికి చెక్ పెట్టొచ్చు.

మిరియాలు కొన్ని తీసుకుని… మంచినీళ్లతో పాటు స్టౌ పై దాదాపు 10 నిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడకట్టి చల్లార్చి అయినా, గోరువెచ్చగా కూడా తీసుకోవచ్చు. మనం తినే ఆహారంలో మిరియాలూ, శొంఠీ, లవంగాలు వీలైనంత ఎక్కువగా వాడాలి. ఇవి జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి.

ఇలా చేయొచ్చు…
1. కప్పు పాలల్లో పావు చెంచా శొంఠి పొడి, కొద్దిగా పటికబెల్లం కలపాలి. దీన్ని తరచూ తీసుకుంటే దగ్గు, జ్వరం, అజీర్తి బాధించవు. కొందరు పాలు ఇష్టపడరు. అలాంటప్పుడు కప్పు నీళ్లను మరిగించి, అందులో ఒక స్పూన్ శొంఠిపొడి వేసి మరొకసారి బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక కాస్త బెల్లం కలిపి తాగాలి. ఇలా రోజుకోసారి తీసుకోవాలి. అలాగే కప్పు వేడిపాలల్లో ఒక స్పూన్ పసుపు కలిపి తాగితే ఎలర్జీ సమస్య కూడా ఉండదు.

2. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, తిప్పతీగ – ఈ నాలుగింటిని సమభాగాల్లో తీసుకుని విడివిడిగా పొడి చేసుకోవాలి. అన్నింటినీ తెల్లని, పల్చని వస్త్రంలో జల్లించాలి. వీటన్నింటినీ కలిపి ఓ సీసాలోకి తీసుకోవాలి. ప్రతీరోజూ 1/2టేబుల్ స్పూన్ పొడిలో కొద్దిగా తేనె, నెయ్యి కలిపి తీసుకోవాలి. తేనె కన్నా నెయ్యి మోతాదు ఎక్కువగా ఉండాలి. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. లేదంటే కప్పు నీళ్లలో ఇదే మిశ్రమాన్ని ఒక స్పూన్ కలిపి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు సగం అయ్యేంత వరకు ఉంచి దింపేసి సరిపడా బెల్లం కలిపిగోరువెచ్చగా తాగాలి.

Check for illness with Peppermints

Telangana news

Comments

comments