Home తాజా వార్తలు మైనింగ్ ఆదాయం 100 రెట్లు పెరిగింది: కెటిఆర్

మైనింగ్ ఆదాయం 100 రెట్లు పెరిగింది: కెటిఆర్

KTRహైదరాబాద్: తెలంగాణ సర్కార్ పాటించిన పారదర్శక మైనింగ్ విధానంతో రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడిందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సరికొత్త సాంకేతికత, పారదర్శక విధానంతో మైనింగ్ రంగంలో ఆదాయం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2004-14 మధ్యకాలంలో ఏటా రూ.3.94 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం సమకూరిందని అన్నారు. అదే టిఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 2014-18 మధ్యకాలంలో మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం ఏకంగా రూ.1,600 కోట్లకు చేరుకుందని కెటిఆర్ తెలిపారు. గతంతో పోల్చుకుంటే మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందన్నారు. ఇదే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ… ట్విట్టర్ లో కెటిఆర్ ప్రశంసించారు.

Check on Mining Boosts Telangana Revenue