Home రాజన్న సిరిసిల్ల కొనుగోలు కేంద్రాల తనిఖీ

కొనుగోలు కేంద్రాల తనిఖీ

Check-image

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాష్ట్ర పౌర సరఫరా ల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆకస్మిక పర్యటన కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల,జిల్లెల్ల ఎక్స్ రోడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అకున్ సబర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అక్కడ రైతులకు అందుతు న్న సదుపాయాలు,ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్న తీరును డాటాఎంట్రీ, రైతులకు ధాన్యం అమ్మిన తర్వాత డబ్బు వారి ఖాతాల్లో జమ అవుతున్న తీరును ఆయ న తనిఖీ చేశారు. సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్న తీరుపై జిల్లా కేంద్రంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి యాస్మిన్ భాషాతో చర్చించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల పనితీరును అభినందించారు.ఈ కార్య్రమంలో సివి ల్ సప్లయ్ డిఎం శ్రీకాంత్‌రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.