Search
Thursday 15 November 2018
  • :
  • :

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండి

Spring-Onionచౌకగా దొరికే ఉల్లికాడల్లో అత్యధిక పోషకాలున్నాయి. వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కెలోరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి కాబట్టి  ఉల్లికాడలను తింటే అధిక బరువు సమస్య తలెత్తదు. పీచు పదార్థం సమృద్ధిగా ఉంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది. హానికారక కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గర్భిణులు తొలి మూడు నెలల్లో వీటిని తినడం వల్ల కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. వెన్నుముక సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. కాలేయం చుట్టూ పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గిస్తుంది.  సి, బి 2, ఎ, కె విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.వీటిలోని అధిక సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును మెరుగుపరుస్తుంది. వీటిలోని క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దీనిలో ఉన్న యాంటీబాక్టీరియల్ జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. స్థూల పోషకాలు ఉండటం వల్ల జీవక్రియ నియంత్రణకు పనికొస్తుంది. కీళ్ల నొప్పులు, ఉబ్బసం ఉన్నవారికి ఇదొక దివౌషధం.

Comments

comments