Home వార్తలు కణాల డ్యామేజీకి చెక్

కణాల డ్యామేజీకి చెక్

orangeతియ్యగా, పుల్లగా, పూర్తిగా రసం నిండిని కాయలు బత్తాయిలు. బత్తాయి తొక్కలు గట్టిగా ఉండి ఒలవడానికి సమయం పడుతుంది. అయినా సరే ఒలుచుకుని బత్తాయి తొనల్లోని రసం నిండిన పూసలను తింటూ ఎంజాయ్ చేస్తారు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే బత్తాయి ఖరీదు చాలా ఎక్కువ ఉండదు. గ్లాసుడు రసం తీసుకుని రోజూ తాగితే కావలసినన్ని ఉపయోగాలు సొంతం చేసుకోవచ్చు.
కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎసిడిటీ తప్ప ఇంకే ఇవ్వవు. కాని తాజా బత్తాయి రసాన్ని తాగచ్చు. డీహైడ్రేషన్ తగ్గించే అమృతం. దాహం తీరుస్తుంది. ఎప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపించినా బత్తాయి రసం తాగితే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
సిట్రస్ కుటుంబానికి చెందిన పండు బత్తాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పుంజుకునేలా చేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ లాటి సమస్యల నుంచి దూరం చేస్తుంది.
ఆర్థరైటిస్ సమస్యను తగ్గిస్తుంది. కణాల డ్యామేజి జరగకుండా కాపాడుతుంది. ఆస్టియోపొరాసిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాటి సమస్యల వలన రోగనిరోధక శక్తిని ఇచ్చే కణాలు నష్టపోకుండా కాపాడుతుంది. అందులో అధికంగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఎముకలకు పుష్టినిస్తుంది. కీళ్లను కాపాడుతుంది.
బరువు తగ్గాలంటే బత్తాయి తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో బత్తాయికి, బత్తాయి రసానికి స్థానం కల్పిస్తే శరీరం షేప్ లోకి రావడానికి కూడా ఉపయోగపడతాయి. ఆకలిని మెరుగు పరుస్తుంది. ఒక మీడియం సైజు బత్తాయి 85 కేలరీల కంటే ఇవ్వదెఉ. కాని కడుఉ నిండిని భావన కల్పిస్తుంది. అందులో ఎక్కువ నీటి శాతం ఉండటమే దానికి కారణం.
లివర్ పనితీరును ప్రభావితం చేసే జాండీస్ రోగులకు డాక్టర్లు ప్రత్యేకంగా బత్తాయి తీసుకోమని సూచిస్తారు. జాండీస్ వస్తే జ్వరం, వాంతులు అవుతాయి. బత్తాయి తేలిగ్గా జీర్ణం అవుతుంది. పైగా లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది.
విటమిన్ సి లోపం ఉంటే స్కర్వి వ్యాధి వస్తుంది. దాని వలన చిగుళ్లు వాస్తాయి, పెదాలు పగులుతాయి, ఫ్లూ వస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఈ పరిస్థితిని చక్కబరుస్తుంది. 100 గ్రాముల బత్తాయిలలో 50 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. రోజూ ఆమాత్రం ఆహారంలో తీసుకుంటే చాలు స్కర్వి వ్యాధి నయం అవుతుంది.
గ్యాస్టోఇంటెస్టెనియల్ సమస్యల నుంచి కాపాడుతుందితాజా బత్తాయిలు తీసుకుంటే సాధారణంగా వచ్చే పొట్ట సంబంధింత వ్యాధులు రావు. ఈ పండులో ఉండే పుల్లటి రుచి లాలా జల గ్రంథులను ఉత్తేజపరచి ఎంజైములు ఊరేలాగా చేస్తుంది. దాని వలన జీర్ణం సులువుగా అవుతుంది. బైలిరూబిన్ స్థాయిలను పెంచే ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి అందులో. బత్తాయిలో ఉండే పొటాషియం డయేరియాను తగ్గిస్తుంది.