Home జిల్లాలు ఇక ‘ట్రాఫికర్’కు చెక్

ఇక ‘ట్రాఫికర్’కు చెక్

దుకాణ సముదాయాల ముందు ఆక్రమణల తొలగింపు
యుద్ధ ప్రాతిపదికన చేట్టిన చర్యలతో విశాలంగా మారిన రహదారులు
landsగజ్వేల్: నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గజ్వేల్ పట్టణంలో జఠిలంగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించే దిశలో నగరపంచాయతీ,పోలీసు అధికారులు చర్యలు ప్రారంభిం చారు. కొన్ని గంటల్లోనే అధికారుల చర్యకు ఫలితం కూడా కనిపిస్తోంది. పట్టణం విస్తురిస్తున్న స్థాయిలో రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య గణనీయంగా పెరగుతోంది. పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న దుకాణ సముదాయాలకు అదనంగా రేకులు,ఫైబర్ షీట్స్‌తో విస్తరింప చేసి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయాలకు కారకులవుతున్నారు. రోజురోజుకు పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు, పాదచారులు సైతం రాకపోకలు సాగించాలంటే  ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోన్న ఆందోళనతో గడపాల్సి వస్తుంది. దీనికి తోడు పలువురు చిరువ్యాపారులు కూడా రోడ్డుఫుట్ పాత్‌ను ఆనుకుని వివిధవ్యాపారాలు నిర్వహంచటం కూడా ట్రాఫిక్ సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ప్రతి బుధవారం జరిగే సంత రోజైతే హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో ఉండే రద్దీని పోలినట్లు గజ్వేల్ ప్రధాన రోడ్లు కనిపిస్తాయి. పట్టణంలో తీవ్రసమస్యగా మారిన ట్రాఫిక్ సమస్యను నియంత్రించటానికి నగర పంచాయతి, పోలీసు అధికారులు నిర్ణయించారు. వెంటనే పట్టణంలోని వ్యాపార వర్గాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దుకాణ సముదాయాల ముందున్న తాత్కాలిక రేకులు,ఫైబర్ షీట్స్, హోర్డింగులు తొలగించని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని గురువారం సాయంత్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో అదే రాత్రి పలువురు వ్యాపారులు తమ దుకాణాల ముందుపైకప్పులుగా వేసిన రేకులు ఇతర విస్తరణ సామాగ్రిని స్వయంగా తొలగించుకున్నారు. ఆప్రక్రియ శుక్రవారం రోజంతా కొనసాగింది. చిరువ్యాపారుల దుకాణాలను ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి వెనక్కి తరలింపచేశారు. ఇందిరాపార్క్ సమీపంలో మూడు వైపులా పోలీసులు స్టాఫర్లను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం స్థానిక సిఐ సతీష్, ఎస్సైలు సత్యనారాయణ, షేక్‌మహబూబ్,నగర పంచాయతి టిపిఓ నర్సింహరాజు పట్టణంలో పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించటంలో తమతో వ్యాపారులు సహకరించాలను సిఐ సతీష్, నగర పంచాయతి కమీషనర్ శంకర్ కోరారు. గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ రహదారిపై ఉన్న దుకాణా సముదాయాల నిర్వాహకులు కూడా అధికారుల ఆదేశాలతో రేకులు,హోర్డింగులను స్వచ్ఛంధంగా తొలగించుకున్నారు. అధికారులు యుద్దప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యతో గతంలో ఎంతో ఇరుకుగా కనిపించిన ఇందిరాపార్క్ నుంచి నగరపంచాయతి కార్యాలయం వైపున్న రహదారి ప్రస్తుతం విస్తరించినట్టుగా మారింది. ఎంతో విశాలమైన రహదారిగా కనిపిస్తున్నది. ఇంకా కొన్ని చోట్ల మాత్రం కొందరు వ్యాపారులు అధికారుల ఆదేశాలను పట్టనట్లున్నారు. ఇదిలా ఉంటే చిరువ్యాపారులు,ఛాట్ మసాలా,పండ్లు, టీబండ్ల నిర్వాహకులకు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది, తాము ఉపాధిలేని వారమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.