Home Default కిచిడీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్!

కిచిడీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్!

chef Vishnu Manohar prepared 3000 kilograms of Khichdi

నాగ్‌పూర్: నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ అనే వ్యక్తి కిచిడీతో గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకోల్పాడు. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అతను 3 వేల కిలోల కిచిడీతో ఈ వినూత్న ప్రయత్నం చేశాడు. అంతేకాదండోయ్ కిచిడీని జాతీయ వంటకంగా గుర్తించాలనీ డిమాండ్ చేస్తున్నాడు. కిచిడీని ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ తింటారని చెబుతున్నాడు. కిచిడి ఆరోగ్యానికి  చాలా మంచిదంటున్నాడు మనోహర్. భారీ స్థాయిలో చేసిన ఈ కిచిడీ కోసం 275 కిలోల రైస్, 125 కిలోల పెసర పప్పు, 150 కిలోల శనగ పప్పు, 3 వేల లీటర్ల నీళ్లు, 150 కిలోల నెయ్యిని ఇందులో వాడాడు. ఈ గిన్నిస్ ఈవెంట్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని, మనోహర్‌ను ప్రశంసించారు. గత సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో 918 కిలోల కిచిడీ తయారు చేసి భారత్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాధించింది. ఆ కిచిడీని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేశాడు.

chef Vishnu Manohar prepared 3000 kilograms of Khichdi