Search
Monday 24 September 2018
  • :
  • :

‘పండిస్తే’ కుదరదిక!

 ధర్మాసనం తీర్పుతో కదిలిన ప్రభుత్వం

 పండ్ల పక్వానికి రసాయనాల వాడకంపై చర్యలు
 ఈ నెల 25న హరీష్‌రావు అధ్యక్షతన కమిటీ సమావేశం
Fruits2మంచిర్యాల: చూడగానే నోరూరించేలా కనిపించే పండ్లు…కాని లోపలున్నదాని గురించి ఆలోచిస్తే తినడం కాదు కదా దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇది రసాయనాల ద్వారా పండ్లను పండించేందుకు వ్యా పారులు చేస్తున్న చీఫ్‌ట్రిక్స్‌తో జనాలపైకి జరుగుతున్న విషప్రయోగం. జిల్లాలో విషం బారిన పడిపండ్లను పండిం చేందుకు చాలా మంది వ్యాపారులు కాల్షియం కార్బైట్ అనే రసాయనపు పొట్లాలను పండ్లలో పెట్టి కృత్రిమంగా పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. మామిడితో పాటు అరటి, బత్తాయి, ఆపిల్ తదితర పండ్లను ఈ పద్దతిలో పండించి మార్కెట్లోకి వదులుతున్నారు.
ఈ పద్దతిలో పండ్లు పక్వానికి రాకున్నా ,త్వరగా పండించి అమ్మేందుకు వ్యాపారులు చేస్తున్న ఈ పనులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని యాపల్‌గుడాలో ఈ విధంగా పండించిన మామిడిపండ్ల రసం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడే ఈ విషయంలో వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
నియంత్రించేందుకు సర్కారు సన్నాహాలు…
తాజాగా ధర్మాసనం పండ్లను రసాయనాలతో పండించే విధానంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు పండ్లను రసాయణాల ద్వారా పండించే విధానంపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రమార్కె టింగ్‌శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు నేత్రుత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. హరీష్‌రావు అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ పండ్లను పండిచే ప్రక్రియపై,రసాయణాల వాడకం నిరోధించే మార్గాలపై చర్చించేందుకు ఈ నెల 25న సమావేశం కానుంది. ఆ సమావేశంలో విధివిధానాలను ఖరారు చేయనుంది.

Comments

comments