మూసాపేట: కూకట్‌పల్లిలో ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు ఆదివారం సందడి చేశారు. మూసాపేట వైజంక్షన్‌లోని ది చెన్నయ్ సిల్క్ మాల్టిబ్రాండ్ స్టోర్‌ను సందర్శించిన ఆయన షోరూంలోని వివిధ విభాగాలను, వస్త్రాలను పరిశీలించారు. హీరో మహేష్‌బాబును చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు షోరూం వద్దకు తరలివచ్చారు. ఈలలు, కేరింతలతో అభిమానులు మహేష్‌బాబుకు అభివాదం చేశారు. చెన్నై సిల్క్ షోరూంకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న మహేష్‌బాబుకు షోరూం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దేశంలోనే ప్రముఖ రిటైలర్ సంస్థ అయిన ది చెన్నయ్ సిల్క్ నగరంలో మొదటి సారిగా కూకట్‌పల్లిలో షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 24 షోరూంలు ఉన్నాయని, సిల్క్ విభాగం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫ్లోర్‌ను మహేష్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు. నాణ్యతమైన, అత్యుత్తమ కష్టమర్ సేవలు, వినూత్న, పోటీ ధరలతో పరిశ్రమలో ఒక ప్రామాణికాన్ని సృష్టించడం ద్వారా చెన్నయ్ సిల్క్ తన వినియోగదారులకు ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుందని, తద్వారా దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ రిటైల్ చైన్లలో ఒకటిగా చెన్నయ్ సిల్క్ పేరోంధిందని సంస్థ ప్రతినిధి పి.కె అర్ముగం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాలచారి, కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి లతోపాటు పులువురు పాల్గొన్నారు.
గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్ -అభిమానుల తొక్కిసలాట
హీరో మహేష్‌బాబు రాకతో కూకట్‌పల్లిలోని జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. వై జంక్షన్‌లోని చెన్నయ్ షోరూం వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, రోడ్డుపై వెళ్లుతున్న వారు సైతం నిలిచి చూడటానికి ప్రయత్నించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కూకట్పల్లి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడాని తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. షోరూం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వేదికకు సపోర్టుగా ఏర్పాటు చేసిన రాడ్ కిందపడిపోవడంతో పోలీసు సిబ్బందికి స్వల్పంగా గాయలయ్యాయి.