Friday, April 19, 2024

ముంబైతో చెన్నై ఢీ నేడే

- Advertisement -
- Advertisement -

chennai super kings vs mumbai indians match

అబుదాబి: శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. అబుదాబి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబైకి రోహి త్ శర్మ, చెన్నైకి మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం వహిస్తున్నారు. ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా నేపథ్యంలో చెన్నై జట్టు ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లింది. అంతేగాక కీలక ఆటగాడు సురేశ్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడం జట్టుపై కాస్త ప్రభావాన్నే చూపింది. అయితే మహేంద్ర సింగ్ వంటి దిగ్గజం కెప్టెన్‌గా ఉండడం చెన్నైకి అతి పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.

అంతేగాక మురళీ విజయ్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ తదితరులతో బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. ఇమ్రాన్ తాహిర్, ఎంగిడి, దీపక్ చాహర్, బ్రావో, జడేజా తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో చెన్నైను ఏమాత్రం తక్కువ అంచన వేయలేం. ఇక రోహిత్ నేతృత్వంలోని ముంబైలో కూడా స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. రోహిత్‌తో పాటు క్వింటన్ డికాక్, కిరన్ పొలార్డ్, సౌరభ్ తివారి, హార్ధిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఆదిత్యతారే తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్‌నైల్, ధావల్ కులకర్ణి, పాటిన్సన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తి కరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News