Home IPL 2018 పంజాబ్ ఆశలు ఆవిరి..

పంజాబ్ ఆశలు ఆవిరి..

chennai-super

పుణె: ఐపిఎల్‌లో ప్లేఆఫ్‌కు చేరాలనే కింగ్స్ లెవన్ పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది. పంజాబ్ ఓటమితో రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్ బెర్త్ దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంతకుముందే ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 153 పరుగులకే ఆలౌటైంది. కీలకమైన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్‌ను వెంటాడింది. కరుణ్ నాయర్ ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో వేగంగా 54 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.