Search
Sunday 18 November 2018
  • :
  • :

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ కన్నుమూత

Chhattisgarh Governor Balramji Das Tandon passes away

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ (90) మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన టాండన్‌ను రాయ్‌పూర్‌లోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. టాండన్ మృతిపై ఆ రాష్ట్ర సిఎం రమణ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. జనసంఘ్ స్థాపించిన వారిలో టాండన్ ఒకరు అన్న విషయం తెలిసిందే. బిజెపిలో ఆయన పలు కీలక పదవుల్లో పని చేశారు. పంజాబ్ డిప్యూటీ సిఎంగా కూడా ఆయన పనిచేశారు. ఆరుసార్లు ఆయన ఎంఎల్‌ఎగా గెలిచారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం కూడా గడిపారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఆయన 2014, జులైలో నియామకమయ్యారు. టాండన్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Chhattisgarh Governor Balramji Das Tandon passes away

Comments

comments