Home జాతీయ వార్తలు వాజ్‌పేయీ సంతాప సభలో మంత్రుల నవ్వుల్..నవ్వుల్

వాజ్‌పేయీ సంతాప సభలో మంత్రుల నవ్వుల్..నవ్వుల్

BJP-Leaders-Smile

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి మంత్రులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సంతాపసభ రాయ్‌పూర్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారంతా వాజ్‌పేయీకి విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. కానీ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అజయ్ చంద్రకర్, వ్యవసాయ శాఖా మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ బిగ్గరగా నవ్వుతూ సంతాప సభను అపహాస్యంపాలు చేశారు. సంతాప సభలో వారిద్దరూ జోకులేసుకుంటూ నవ్వుతున్న విడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రుల తీరుపై అటల్ అభిమానుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు ఈ మంత్రులిద్దరిపై సోషల్ మీడియా సాక్షిగా విమర్శలు గుప్పిస్తునారు.