Home జాతీయ వార్తలు ఛత్తీస్‌గఢ్‌లోనూ సిబిఐకి ‘నో ఎంట్రీ’

ఛత్తీస్‌గఢ్‌లోనూ సిబిఐకి ‘నో ఎంట్రీ’

CBIన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల బాటనే ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోంది. తమ రాష్ట్రంలో కేసుల దర్యాప్తునకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాస్తూ ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఇచ్చిన సమ్మతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946 కింద సిబిఐ ఏర్పాటైంది.దీంతో, ఛత్తీస్‌గఢ్‌లో దాడులు నిర్వహించాలన్నా, దర్యాప్తు జరపాలన్నా సిబిఐ ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

Chhattisgarh withdraws genera consent to CBI, Hereafter CBI has to take prior permission to probe the cases in the state from Chhatisgarh govt