Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కొత్తదనంతో కూడిన ‘చి.ల.సౌ’

Chi-La-Sow

సుశాంత్, రుహాని శర్మ హీరోహీరోయిన్‌లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి.ల.సౌ’. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్  ద్వారా ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ “అన్నపూర్ణ సంస్థ ఎప్పు డూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది.  ‘చి.ల.సౌ’ చిత్రాన్ని నేను చూశాను. చాలా బా గుంది. కొత్తదనంతో కూడిన చిత్రమిది. నాగచైతన్య చెప్పాడని ఈ చిత్రాన్ని చూశాను. రైటింగ్, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. రాహుల్ సూపర్బ్‌గా తీశాడు. అందుకే ఈ సినిమాకు నిర్మాతనయ్యా ను. నాకు ఇదొక కొత్త జర్నీ. కొత్తదనం ఉన్న సినిమాలు ప్రస్తుతం బాగా ఆడుతున్నాయి. ఈ చిత్రం కూడా మంచి సక్సె స్ సాధిస్తుంది. సుశాంత్, రుహాని చక్కగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. రాహుల్ సెక్స్ సినిమా మా అన్నపూర్ణ బ్యానర్‌లోనే ఉంటుంది. ఇక బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ 15 నిమిషాలు ఉంటుంది. ఇందులో రణబీర్, అలియాభట్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక తమిళంలో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను. ప్రస్తుతం చేస్తున్న ‘దేవదాస్’ షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలో నా క్యారెక్టర్ పేరు దేవ్… నాని క్యారెక్టర్ పేరు దాస్. నానీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘బంగార్రాజు’ స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. రచయిత సత్యానంద్, దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కథపై వర్క్ చేస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌లోనే ఈ సినిమా ఉంటుంది”అని అన్నారు.

Comments

comments