Home భద్రాద్రి కొత్తగూడెం సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్లు

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్లు

Chief Engineers examining

 

అశ్వాపురం: మార్చిలో సీతారామ ప్రాజెక్టు పంపు హౌసు ట్రయల్ రన్ నిర్వహించాలని గురువారం చీఫ్ ఇంజనీర్ సూచించారు. అశ్వాపురం మండలంలోని బిజి కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంపుహౌసు నిర్మాణ పనులను ఐదుగురు ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఇప్పటి వరకు ఎన్ని మోటారు పంపులు ఎరక్షన్ వర్క్ పూర్తి అయిందని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం అవడానికి తగు సూచనలు చేశారు. మార్చి నెలలో ట్రయల్న్ నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి ఒడ్డున ఉన్న కుమ్మరిగూడెం వద్ద నుండి కాలువ ద్వార గోదావరి నీరు బిజి కొత్తూరుకు చేరుకుంటుంది. ఇక్కడి పంపుహౌసు నుండి ఎత్తిపోతల ద్వార ప్రధాన కాలువలోకి నీరు ప్రవహిస్తుంది. గోదావరి నది వద్ద నుండి పంపుహౌసు వరకు పనుల వివరాలు ఏ దశలో ఉన్నది అడిగి తెలుసుకున్నారు.

లక్ష్యానికి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఉపయోగించే పంపుహౌసు మోటార్లు వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. పనులలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని అన్నారు. ఇంజనీర్ల బృందం అక్కడ పనులు పర్యవేక్షింస్తుండగానే వారికి సియమ్ చంద్రశేఖరరావు ఫోను చేసి ప్రాజెక్టు పంపుహౌసు ట్రయల్న్ మార్చిలో చేయాలని అందుకోసం పనులు వేగవంతంచేయలన్నారు. పంపుహౌసు ద్వార వచ్చే సాగు నీరు తుమ్మల చెరువుకు లింక్ చేయాలని యంపిపి కొల్లు మల్లారెడ్డి, నెల్లిపాక సహకార సంఘం చైర్మన్ మర్రి మల్లారెడ్డి చీఫ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ఇంజనీర్లు ఎస్ చంద్రమౌలి, యం.శ్యాం ప్రసాద్ రెడ్డి, జి.దామోదర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Chief Engineers examining the Seetharama project works

Telangana Latest News