Search
Saturday 22 September 2018
  • :
  • :

పర్యావరణ ప్రేమికులకు శుభాకాంక్షలు: కెసిఆర్

Auto Industry Representatives Meet Chief Minister KCR

హైదరాబాద్: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని సిఎం కెసిఆర్ పర్యావరణ ప్రేమికులు, పచ్చదనం పోత్సాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  కెసిఆర్ మాట్లాడారు. సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ముఖ్యమైనదని ఆయన స్పష్టం చేశారు. రానున్న తరాలకు మంచి వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యంమని పేర్కొన్నారు. అందులో భాగంగానే హరితహారం కార్యక్రమాన్నిఅమలుచేస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరంగా ప్రపంచవ్యాప్తంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచమంతటా వస్తున్న మార్పుల ప్రభావం మన రాష్ట్రంపై కూడా ఉంటుందని తెలియాజేశారు. కాలుష్య కారకాల వాడకం నియంత్రణపై అందరూ దృష్టి పెట్టాలని సిఎం సూచించారు. ప్లాస్టిక్ వాడకంపై పొంచి ఉన్న ప్రమాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రచారం చేస్తోందని ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల తలెత్తే దుష్పరిణామాల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని కెసిఆర్ సూచించారు. కాలుష్యరహిత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించాలని కోరారు. రాష్ర్టాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంకోసమే హరితహారమన్నారు. మొక్కల పెంపకం, రక్షణకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసమే చెట్లు పెంపు ఆలోచన అందరిలో కలగాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం సక్సెస్ అవుతుందని చెప్పారు. జులైలో జరిగే నాలుగో విడత హరితహారంలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతికేలా రక్షణచర్యలు తీసుకోవాలని ప్రజలకు, అధికారులకు సూచించారు. సౌరవిద్యుత్‌లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. అటవీశాఖ చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలూ సత్ఫలితాలిస్తున్నాయని కెసిఆర్ వెల్లడించారు.

Comments

comments