Home తాజా వార్తలు జయశంకర్ సేవలను స్మరించుకున్నకెసిఆర్

జయశంకర్ సేవలను స్మరించుకున్నకెసిఆర్

CM-KCR

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆయన సేవలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి జయశంకర్ అని సిఎం పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిదని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి జయశంకర్ ఆత్మకు శాంతి కలిగిస్తుందని కెసిఆర్ అన్నారు.