Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రేపు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన…

Chief minister kcr to visit delhi tomorrow

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో కొత్త జోనల్ వ్యవస్థను తెలంగాణ సర్కార్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందేందుకు స్వయంగా తానే ఢిల్లీ వెళ్లాలని సిఎం నిర్ణయించుకున్నారు. జోనల్ వ్యవస్థకు కేంద్ర ఆమోదం సాధించే ప్రక్రియను కెసిఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి అవసరమైతే ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణకి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని వివరించి చెప్పాలని సిఎం అన్నారు.

Comments

comments