Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యుద్ధ ప్రాతిపదికన భగీరథ

CM reviewing the Mission Bhagiratha

సిఎం ఆదేశాలతో రాత్రింబవళ్లు పనులు

మన తెలంగాణ/నిజామాబాద్ : తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటికి అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంకల్పం నేరవేరే దిశగా అధికారులు పనులు వేగాన్ని పెంచారు. ఇటీవలే మిషన్ భగీరథ పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆగస్టు 14 అర్థరాత్రి వరకు ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందాల్సిందేనని స్పష్టం చేసిన విష యం తెలిసిందే. దీంతో తమ పనుల తీరుపై అంచనా వేసుకున్న అధికారులు రాత్రింబవళ్లు పనులను కొనసాగిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమ నియోజకవర్గంతో పాటు జిల్లాలో కొనసాగుతున్న పనుల తీరుపై సమీక్షించి సిఎం విధించిన లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తు తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో దాదాపు పనులు చివరిదశకు చేరగా రెండు నియోజకవర్గాల్లో పనుల వేగాన్ని ఒక్కసారిగా పెంచారు. ఉమ్మడి జిల్లాకు తాగునీటి కోసం శ్రీరాంసాగర్, సింగూరు జలశయాలను ఎంచుకోగా శ్రీరాంసాగర్ నుండి బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి, రామారెడ్డి మండలాలకు తాగునీరందిస్తారు. అందుకు కామారెడ్డి పరిసర గ్రామాలకు శుద్ధి జలాశయం మర్కల్ గుట్ట వద్ద ఏర్పాటు చేయగా పనులు దాదాపు పూ ర్తయినట్లు అధికారులు తెలిపారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ తదితర మండలాలకు తాగునీటి కోసం ఇందల్వాయి వద్ద శుద్ధి జలాశయాన్ని ఏర్పాటు చేయగా పనులు వేగం అందుకున్నాయి. ప్రస్తుతం పైప్‌లైన్ల శుద్ధికోసం ట్రయల్న్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 80శా తం పనులు పూర్తి కాగా అంతర్గత పైప్‌లైన్లు, కుళాయిల కనెక్షన్‌లు మాత్రమే మిగిలి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాల్కొండ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ నియోజకవర్గం కావడంతో ఆయన మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మరోపక్క సింగూరు జలాశయంపై ఆధారపడ్డ జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాల్లో బోధన్‌లో పనులు కొంతమేర వెనకబడినట్లు తెలుస్తోంది. బాన్సువాడలో ఇప్పటికే పలు గ్రామాలకు ట్రయల్‌ర న్ పూర్తికాగా ఉపరితల జలశయాలు పూర్తయ్యాయి. అంతర్గత పైప్‌లైన్లు 20శాతం పూర్తి కావాల్సిఉండగా వాటిని వెంటనే పూర్తి చేసేలా మంత్రి అధికారులను పరుగెత్తిస్తున్నారు. మొత్తానికి శ్రీరాంసాగర్ పరిధిలోని 1884 కి.మీ. పైప్‌లైన్ పనులకు గాను 1500మి.మీ పైప్‌లైన్ పనులు పూర్తి కాగా సింగూరు పరిధిలోని 1537 కి.మీ గాను మొత్తం పైప్‌లైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే నిజామాబాద్ జిల్లాలోని 320 జలశయాలు, కామారెడ్డిలోని 300 ఉపరితల జలశయాల పనులు అసంపూర్తి గా ఉండగా వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. రోజువారిగా పనుల తీరుపై నివేదికలు కోరుతుండటంతో రాత్రుళ్లు సై తం పనులు జరుగుతున్నాయి. పల్లెల్లో పైప్‌లైన్‌ల పనులే ప్రస్తు తం అధికారుల కలవరానికి కారణమవుతోంది. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు పూర్తయితే కుళాయిల కనెక్షన్‌లు వెంటనే పూర్తి చేయచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 2121 కి.మీ పైప్‌లైన్ వేయాల్సి ఉండగా ప్రస్తుతం వెయ్యి కి.మీ వరకు పూర్తవగా నిజామాబాద్ జిల్లాలో 2618 కి.మీ.కు గాను 900 కి.మీ పైప్‌లైన్ పనులు పూర్తయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5లక్షల 45 ఇ ళ్లకు రక్షిత తాగునీరు అందించాలన్నది లక్షం కాగా ఇప్పటి వరకు లక్ష పై చిలుకు కుళాయిలు బిగించినట్లు తెలుస్తోంది. మరో 4లక్షల కుళాయిలు బిగిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయినట్లవుతుంది.

Comments

comments