Search
Tuesday 20 November 2018
  • :
  • :

సఫల యాత్ర

Chief Minister who arrived from Hyderabad to Delhi

ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి
నేడో, రేపో కేబినెట్ భేటీ?
5,6 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు?
డిఎ ప్రకటించే అవకాశం
నేడు గవర్నర్‌ను కలుసుకోనున్న కెసిఆర్?

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఒకటి, రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 22వ తేదీన మంత్రుల సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించిన కెసిఆర్ ఇప్పు డు మంత్రివర్గ సమావేశాన్ని కూడా ‘అర్జెం ట్’ పేరుతో నిర్వహించేలా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. వీలైతే మంగళవారం సాయంత్రమే లేదా బుధవారం జరి గే అవకాశం ఉంది. ఈ నెల 5, 6 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశం ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి, కరువుభత్యం తదితర అంశాలతో పాటు రెవిన్యూ శాఖకు సంబంధించి నాలుగు ముఖ్యమైన అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా శాఖల తరఫున అవసరాలు, అనుమతులు పొంది ఉన్నవాటికి మంత్రివర్గ ఆమోదం అవసరమైన అంశాలకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రంకల్లా పంపాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ అన్ని విభాగాల కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులకు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు నోట్ పంపింది.

ఢిల్లీ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి వివిధ వర్గాల ప్రజలకు ప్రకటించిన వరాలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్చులకు వయోపరిమితి పెంపు, వేతనం పెంపు, వివిధ వర్గాల ప్రజలకు ‘ఆత్మగౌరవ భవన్’ల కేటాయిం పు తదితరాలపై కూడా మంత్రివర్గం ఈసమావేశంలో ఆమోదం తెలపనుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా జోనల్ వ్యవస్థకు ప్రధాని ఆమోదం తెలపడం, త్వరలో రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడనుండడంపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. ఢిల్లీ విశేషాలను కూడా వివరించనున్నట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీన రాజకీయ అంశాలను మంత్రుల సమావేశంలో చర్చించిన కెసిఆర్ ఇప్పు డు మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన పరిపాలనా సంబంధ అంశాలను చర్చించనున్నట్లు అధికారి వివరించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతిపై పంద్రాగస్టుకే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో వేతన సవరణ సంఘం ఇచ్చే మధ్యంతర నోట్ (వివరణాత్మక నివేదిక) ఆధారంగా ఉద్యోగులకు ఏ మేరకు ఐఆర్ ఇవ్వడంసమంజసంగాఉంటుందో అం చనా ప్రకారం ఒక నిర్ణయాన్ని తీసుకోడానికి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం.

నేడు గవర్నర్‌తో భేటీ?
ఢిల్లీ పర్యటనకు ముందు గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి తన మూడు రోజుల పర్యటన విశేషాలను మంగళవారం మళ్ళీ రాజ్‌భవన్‌కు వెళ్ళి వివరించనున్నట్లు తెలిసింది. ఉదయం పదకొండు గంటలకు గవర్నర్‌ను కలిసి జోనల వ్యవస్థకు సంబంధించిన అంశంతో పాటు ప్రధాని, కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కరీలతో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించిన అంశాలపై వచ్చిన స్పందనను వివరించే అవకాశం ఉంది. ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అంశాన్ని కూడా గవర్నర్‌కు వివరించనున్నట్లు తెలిసింది.

Comments

comments