Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఢిల్లీలో విజృంభిస్తున్న చికెన్‌గన్యా

SISODIYAఢిల్లీ : ఢిల్లీలో చికెన్‌గన్యా విజృంభిస్తోంది. చికెన్‌గన్యా రోగులు పెరుగుతుండడం, మృతుల సంఖ్య కూడా అధికమవ్వడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియాను ఫిన్‌లాండ్ పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీనిపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ శనివారం స్పందించారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిని తానని, లెఫ్టినెంట్ గవర్నర్ ఏం మాట్లాడుకుంటున్నారో , తనతో మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ గొంతు ఆపరేషన్ నిమిత్తం బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఫిన్‌లాండ్ పర్యటనలో ఉన్న సిసోడియాను వెంటనే ఢిల్లీకి రావాలని జంగ్ ఆదేశించారు. సిసోడియా విద్యా శాఖను కూడా నిర్వర్తిస్తున్నారు. చికెన్‌గన్యా కారణంగా ఢిల్లీలో ఇప్పటి వరకు 30 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. చాలా మంది చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా కేసులతో కలిపి దాదాపు మూడువేల విషజ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ అందుబాటులో లేకపోవడం, సిసోడియా పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. నగరంలో విషజ్వరాలతో బాధపడుతుంటే సిసోడియా హాలీడే ట్రిప్‌కు వెళ్లాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రిని తాను కదా … ఏ విషయమైనా తనతో మాట్లాడండి అంటూ సత్యేంద్ర జైన్ చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే వెయ్యి పడకలు అదనంగా వేయించామని, రోగుల చికిత్సకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జైన్ తెలిపారు.

Comments

comments