Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పాఠశాల బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం

Child died in Road Accident at Kurnool

కర్నూలు : గడివేములలో పాఠశాల బస్సు కింద పడి హంసిక (2) అనే చిన్నారి మృతి చెందింది. మండల పరిధిలోని బిలకల గూడురుకు చెందిన వెంకట్‌రెడ్డి, ప్రవళికలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో చిన్న కూతురు హంసిక శుక్రవారం ఉదయం తన పెద్దమ్మ కుమార్తెల వద్దకు వెళ్లింది. వారు గడివేములలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల బస్సు ఎక్కేందుకు వారితో పాటు హంసిక సైతం వెళ్లింది. బస్సు కదిలే సమయంలో హంసిక వెనుక టైరు కింద పడి మృతి చెందింది. పోస్టుమార్టం కోసం హంసిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Child died in Road Accident at Kurnool

Comments

comments