Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

సాంబారులో పడి చిన్నారి మృతి

Child Dies In Gurukula Girls School In Kamareddy Dist

పిట్లం ః మండల కేంద్రంలో మహత్మజ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం వంట చేస్తుండగా వంట మనుషులు యాదవ్, శోభల కూతురు చిన్నారి కీర్తన (3) ప్రమాదవశాత్తు మరుగుతున్నటు వంటి సాంబా రు గిన్నెలో పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాపను బయటకు తీసి పిట్లం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు పంపించారు. వారు అక్కడ వైద్యం నిర్వహిస్తుండగా శుక్రవారం రాత్రి చిన్నారి మరణించిందని తండ్రి యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ గులాం రబ్యాని ని వివరణ కోరగా మద్నూర్ మండలం నాగూల్‌గాం గ్రామానికి చెందిన యాదవ్ అతని భార్య శోభలు పాఠశాల ఒప్పందం కూలీలుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై శనివారం ఘటన జరిగిన స్థలం గురుకుల పాఠశాలను తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ సత్యనారాయణరెడ్డి, జడ్పిటిసి ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపిపి నర్సాగౌడ్‌లు పరిశీలించి, వంట సిబ్బంది పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Comments

comments