Search
Thursday 15 November 2018
  • :
  • :

వైద్యం వికటించి శిశువు మృతి

Child Dies With Neglect Treatment in Hospital

తొర్రూరు: వైద్యం వికటించి శిశువు మృతి చెందిన సంఘటన డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని సాయిమల్లు-మమత దంపతుల కుమారుడు (4నెలలు) శుక్రవారం రాత్రి జ్వరం, ఆయాసంతో ఇబ్బందులు పడుతూ డివిజన్ కేంద్రంలోని సాయి మల్టీ ఆసుపత్రికి రాగా జ్వరం ఉన్న కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. శనివారం బాబుకు పాలు పట్టించిన వెంటనే మలం శుభ్రం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పాలు గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి జారి పోవడంతో ఊపిరి ఆగిపోయిందని, వెంటనే కృత్రిమ శ్వాస అందించిన ఫలితం దక్కలేదు. బాబుకు సరైన వైద్యం అందించ లేదని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments