Home ఖమ్మం భద్రాచలం ఆస్పత్రిలో మగశిశువు మాయం

భద్రాచలం ఆస్పత్రిలో మగశిశువు మాయం

BREAKఖమ్మం : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మగశిశువు మాయమైంది. చర్లమండలం తేగడ గ్రామానికి చెందిన రాధ కాన్పుకోసం ఈనెల 8న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరింది. 9న మగబిడ్డకు జన్మనిచ్చింది. మగశిశువుకు కామెర్లు సోకడంతో ఆస్పత్రిలోని ఇంక్యూబేటర్ గదిలోఉంచారు. సోమవారంమధ్యాహ్నం కూడా తల్లి వద్దపాలు పట్టించారు.అనంతరం మళ్లీ ఇంక్యూబేటర్‌లోచికిత్సనిమిత్తం ఉంచారు. ప్రతి 2,3 గంటలకొకసారి తల్లిపాలు పట్టించాల్సి ఉంది. కానీఅర్ధరాత్రి దాటినా శిశువును తల్లి వద్దకు తీసుకరాకపోవడంతో అనుమానం వచ్చిన రాధ బంధువులు ఆర తీయగా శిశువు మాయమైనట్టు తెలిసింది. దీంతో రాధ బంధువులు ఆందోళనకుదిగారు.