Home తాజా వార్తలు బాల కార్మికులకు విముక్తి

బాల కార్మికులకు విముక్తి

  • వ్యవసాయ క్షేత్రంపై బాలకార్మిక నిరోధక ప్రత్యేక బృందం ఆకస్మిక దాడి
  • కోపంతో విలేఖరులను దూషించిన తోట యాజమాని
  • నాపైనే వార్త రాస్తారా…? మీ అంతు చూస్తానంటూ బెదిరింపు
  • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పాత్రికేయులు

Mahabubnagar_Child_Labourనవాబ్‌పేట: ‘చట్టానికి తూట్లు’ శీర్షికతో గురువారం ‘మన తెలంగాణ’ ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు తక్ష ణమే స్పందించారు. మండల కేంద్రానికి సమీపంలో గల ఓ వ్యవసాయ క్షేత్రంపై బాలకార్మిక నిరోధక ప్రత్యేక బృందం దాడి నిర్వహించి అక్కడ పని చేస్తున్న 5 మంది బాలకా ర్మికులను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్స రాలుగా చిన్నపిల్లలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఆంధ్ర పత్తి తోట యాజమాని సీతారాములు తన ఫామ్‌హౌ జ్‌లోకి ఒక్కసారిగా అధికారుల దాడులు చేయడంతో అవాక్కయ్యారు. తోటలో పని చేస్తున్న చిన్న పిల్లలను దాచే లోపే అధికారులు వాళ్ల వద్దకు చేరి విచారణ ప్రారం భించ డంతో యాజమాని నిత్సాహాయ స్థితిలో కోపంతో ఊగి పోతూ… అధికారులతో పాటు వెళ్లిన విలేకరులను ఉద్దేశిం చి తీవ్రమైన పద జాలంతో నాపైనే వార్త రాస్తారా…? మీ అంతు చూస్తానని… దూషిస్తూ విలేకరులపైకి వెళ్లడంతో అధికారులు అతన్ని పట్టుకుని వారించారు. తోటలో పని చేస్తున్న లోకిరేవు గ్రామానికి చెందిన బాలికలందరిని విచా రించి ఐదుగురు బాలకార్మికులను వాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు. సదరు యాజమానిపై ఉన్నతాధికా రులలో చర్చించి చర్యలు తీసుకుంటామని బాలకార్మిక నిరో ధక బృందం ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.
యాజమాని ప్రవర్తనపై విలేకరుల నిరసన
సమాజంలో చిన్నపిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న అక్రమా ర్కుల నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసిన విలేకరులపై ఆంధ్రప్రాంతానికి చెందిన సదరు తోట యాజమాని అధికారుల సాక్షిగా తీవ్రమైన పదజాలంలో దూషించడంతో మండ ల విలేకరులు తీవ్ర మనస్తాపానికి గురై తోట యాజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.