Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మంత్రి తలసానికి పుష్పాలతో చిన్నారులు

Children are giving flowers to the minister's thalasani
అమీర్‌పేట : బాపూనగర్‌లోని అంగన్‌వాడి పాఠశాలలో గత కొన్నేళ్ళుగా విద్యుత్, మంచినీరు వసతులు లేకపోవడంతో పిల్లలు పడే భాదలు అర్ధం చేసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో పిల్లలకు అధికారులు సౌకర్యాలను కల్పించారని వార్డు సభ్యులు హరిసింగ్ జాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడిలో చదువుకునే పిల్లల సమస్యలపై మంత్రి వెంటనే స్పందించి పాఠశాలలో విద్యుత్‌తో పాటు మంచి నీటి కనెక్షన్‌ను ఇప్పించినందుకు పిల్లలు మంత్రి నివాసానికి వెళ్ళి పుష్పాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారని అమీర్‌పేట జిహెచ్‌ఎంసి వార్డు సభ్యులు హరిసింగ్ జాదవ్ తెలిపారు. ఈ కార్యక్రంలో పాఠశాల ఉపాధ్యాయరాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments