Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశివుల మార్పిడి

Childrens Exchange in Patancheru Govt hospital

పటాన్ చెరు: డబ్బులకు కకృత్తి పడ్డ ఆసుపత్రి సిబ్బంది అప్పుడే పుట్టిన శిశువులను తల్లి ఒడిలో నుంచి మార్చారు . ఆడ శిశువు స్థానంలో మగ శిశువును, మగ శిశువు స్థానంలోకి ఆడ శిశువును తల్లులకు తెలియకుండా బెడ్ లో నుంచి మార్చారు. ఇది గమనించిన బాలింత ఆసుపత్రి సిబ్బందితో గొడుప పడడంతో పాటు ఉన్నత అధికారులకు సైతం పిర్యాదు చేశారు. దీంతో వార్డు బాయి తప్పిదం వల్ల పొరబాటు జరిగిందని సర్ది చెప్పి ఎవరి శిశువును వారికి అప్పజెప్పారు. ఇలాంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయని సిబ్బంది గోప్యంగా తమ చేటి వాటం ప్రదర్శిస్తు డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం ఎక్కడో కాదు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. జిన్నారం మండలం అండూరు గ్రామానికి చెందిన శ్రీశైలం కు బాబు పుట్టాడని వైద్యులు చెప్పారు. ఆదె సంతోషంలో ఉండగానే కాదు పాప అన్నారని , అయిన పాప అయిన బాబు అయిన ఒక్కటే కాని మా రక్తం పంచుకొని పుట్టిన బాబు అయితే సంతోషంగా ఉంటామన్నారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సుపరిండెట్ దృష్టికి తీసుకెళ్లారు.శిశువుల తల్లులు అర్చన, సరస్వతి లు తమ పిల్లలు తమకే కావాలంటున్నారు. విషయం తెలుసుకున్న వైద్య అధికారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ జరిపిన అధికారి ఇద్దరి డెలివరి 20 నిముషాల తేడాలో జరిగిందన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతామన్నారు.

Comments

comments