Home జోగులాంబ గద్వాల్ నేడు మోగనున్న బడి గంట

నేడు మోగనున్న బడి గంట

Children's feet  schools side

నేటి నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం
బడి వైపు పిల్లల అడుగులు
బడి సమస్యలు సుడి
మరుగుదొడ్లు కరువు
రోజుకోక జీవొతో ఉపాధ్యాయుల పరేషాన్
ఎండలు ఎక్కువ ఉండటంతో ఆందోళనలో తల్లి దండ్రులు

మన తెలంగాణ/అలంపూర్: వేసవి సెలవులలో ఆడి పాడి కేరింతల్లో సరదాగా గడిపిన పిల్లలు నేటి నుంచి బడివైపు అడుగులు వేయనున్నారు. బండెడు బరువు పుస్తకాలతో బడిబాట పట్టనున్నారు. సెలవులలో పొందిన ఆనందం బడిలోని స్నేహితులతో పంచుకోనున్నారు. ఇంటితో వీధిలోని మిత్రులతో విడ దీయలేని బంధాన్ని పెంచుకున్న పిల్లలు భారమైన మన స్సుతో బడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండ తీవ్ర తలకు ఎటూ వెళ్లనీయని తల్లితండ్రుల గోల కంటే బడిలో ఉండటమే ఆనందంగా ఉంటుందని కొందరు పిల్లలు బడి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక సెలవుల్లో సేదతీరిన ఉపాధ్యా యులు విధి నిర్వహణలో సమయపాలన పాటించటానికి ఉరుకులు పరుగులకు సిద్దమవుతున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆటపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టనున్నారు. ఎప్పటిలాగే ఈఏడాది కూడా సర్కారు బడులు విద్యార్థులను సమస్యలతో స్వాగ తం పలుకుతున్నాయి. సరిపడా గదులు లేక మరుగుదొడ్లు కానరాక.. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు ఆహ్వానం పలుకుతున్నాయి. శుక్రవారం నుండి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఎండలు ఎక్కువ ఉండటంతో తల్లి దండ్రులు ఆందోళనలో వున్నారు. ఎండలు ఎక్కువ ఉండటంతో పిల్లలను బడికి పంపేస్థితిలో లేనట్లు తెలుస్తుంది. ప్రతి సవత్సరం జూన్ 12 నుండి ప్రారంభం అయె షెడ్యూల్ ఈ సంవత్సరం జూన్ ఒకటి నుండి ప్రారంభం కావడంతో ఎండలు మండుతున్న ప్రభుత్వం షెడ్యూల్‌ను తల్లి దండ్రులు వ్యతిరేకరిస్తున్నారు. అధికారుల నిర్లక్షంతో విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు లేకపోవcం.. ఉపాధ్యాయుల అధికంగా ఉన్నచోట విద్యాలు లేకపోవడం సర్వసాధారణమైంది. ఇక గుణాత్మక విద్య విద్యార్థుల దరికి చేరడం లేదు. పాఠశాలలో సమస్యల కారణంగా ఏటా వందలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఈ సంవత్సరమైనా
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యతును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను రోపొందిస్తారని తలి దండ్రులు భావిస్తున్నారు.

బడిబాట షెడ్యూల్ ఇదే…
ఈ నెల ఒక్కటి, రెండో తేదిలలో పాఠశాల ఎదావిధిగా రెండుపుటలు నిర్విహించాలి, నాటుగొవ తేది నుండి ఎనిమిదో తేది వరకు ఉదయం 7.00 గంటల నుంది ఉదయం 11.00 గంటల వరకు బడిబాట సర్వేలో భాగంగా డోర్‌టుడోర్ కార్యచరణ ప్రణాళిక రూపొందిచుకుని బడి పిల్లలను బడిలో చేర్చించాలి. సోమవారం నుండి బడులు ఎదావిధిగా కొనసాగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే పొందే లభాలపై ఎస్‌ఎంసీలను భాగస్వామ్యం చేస్తూ ప్రబారం నిర్వహించాలి. పాఠశాల అధీన ప్రంతంలో గల బడిబయల పిల్లల జాబితాను సిద్ధం చే సుకొవాలి. ఇంటింటికీ వెళ్లి పాఠశాలకు సంబంధించిన కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయాలి. పిల్లల తల్లిదుడ్రులను ఒప్పించి బడిలో చేర్చించాలి.

కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల హవా…
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం.. ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండడంతో చాలా మంది తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో ఆడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఉపాధ్యాయులు బలోపేతం కొసం పూనుకొవాల్సిన అవసరం ఉంది.

గురుకుల పాఠశాలకు ప్రాధాన్యత…
ప్రభుత్వం ప్రవెశ పెట్టిన గురుకుల పాఠశాలలో పిల్లలను అడ్మిషన్లు చెయించడానికి తల్లి దండ్రులు అసక్తి చుపుతున్నారు. పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల అడ్మిషన్ల సంఖ్యతగ్గె భావానాలు వున్నయి. గురుకుల పాఠశాలలో విధాలుగా సదుపాలయలు అందించడంతో తల్లి దండ్రులను ఆకాశిస్తున్నాయి.