Home మంచిర్యాల చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమం పోస్టర్ల విడుదల

చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమం పోస్టర్ల విడుదల

cpi

మనతెలంగణ/ మంచిర్యాల సిటీ: భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సామాజిక భద్రత పథకాలు మెరుగుకై పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలని కోరుతూ బుధవారం ప్రగతిశీలభవణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీజే) ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్లు విడుదల చేసారు. ఈసందర్బంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివజన్ కార్యదర్శి ఏ లాల్ కుమార్ మాట్లాడుతూ భవణ కార్మికుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ ఈనెల 10న హైదరాబాద్‌లోని లేబర్ కమీషనర్ కార్యాలయం ముట్టడించి ధర్నా కార్యక్రమం నిర్వహించ బడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం దివాలా తీయడంతో పేదరైతులు పొట్ట కూటికోసం పట్టణాలకు వలసలు వచ్చి భవణ ఇతర నిర్మాణ రంగాలలో కూలీ చేస్తు పొట్ట పోసుకుంటున్నారన్నారు. పట్టణ ప్రాంతాలలో వలసలు పెరిగి నిర్మాణ రంగంలో కార్మికుల సంఖ్య పెరిగిందన్నారు. వీరిలో అధిక శాతం నిరక్షరాస్యులే అన్నారు. వీరికి ప్రభుత్వ పథకాలు, వాటిని వినియోగించుకునే విధానం తెలియదన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన సుమారు 23 రకాల కార్మికులు ఈరంగంలోకి వస్తారన్నారు. కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉందన్నారు. కార్మికుల పిల్లలు విద్య, వైద్యానికి దూరమౌతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిస్కరించాలని డిమాండ్ చేసారు ప్రమాదంలో మరణించిన కార్మకుని కుటుంబానికి రూపాయలు 10 అక్షలు, సహజ మరణానికి 2లక్షలు, ఆడవారికి ప్రసూతి సహాయం 50 వేలు, పెండ్లికానుక 1లక్ష, పెన్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.పోస్టర్ విడుదల కార్యక్రమంలో సీపీఐ (ఎమ్మెల్) ఎన్‌డీ జిల్లా నాయకులు సాజిద్, తిరుపతి, రసీద్, లక్ష్మన్, ఆగోవ్, గోపాల్, హౌతురాజ్, వి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.