Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

డోక్లాంలోకి మళ్లీ చొరబడ్డ చైనా

భారత్, భూటాన్‌లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెరికా ఆరోపణ

Chinese Soldiers Entered in Dokalam.

వాషింగ్టన్: డోక్లాం వివాదంతో గత ఏడాది భారత్, చైనాల మధ్య దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. భారత్, చైనా, భూటాన్‌ల ట్రైజంక్షన్‌లోకి చొరబడ్డ సైన్యాలు అక్కడూ తిష్టవేసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం, వాటిని భారత సైన్యం అడ్డుకోవడంతో రెండు దేశాల యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దౌత్యమార్గాలద్వారా చర్చలతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా చైనా మరోసారి డోక్లాంలోకి చొచ్చుకొని వచ్చిందని, అయినా భారత్ ఏమీ చేయడం లేదని అమెరికా ఆరోపించింది.

‘ డోక్లాం ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలను నిశ్శబ్దంగా తిరిగి ప్రారంభించింది. అయినా అటు భారత్ కాని, ఇటు భూటాన్ కాని వీటినిఅడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఆన్ వాగ్నర్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ దీవులను నిర్మించి వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా వాగ్నర్ ఈ ఆరోపణలు చేశారు.‘డోక్లాం వివాదం సద్దు మణిగిన తర్వాత కూడా చైనా అక్కడ నెమ్మదిగా తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. భారత్‌కాని, భూటాన్ కాని చైనాను వెనక్కి పంపించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా చర్య దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశ చర్యను గుర్తుకు తెస్తోంది. దీనికి అంతర్జాతీయ స్పందన ఏమిటి?’ అని వాగ్నర్ ప్రశ్నించారు. దీనికి  దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలైక్ జి వెల్స్ స్పందిస్తూ, ‘ ఉత్తర సరిహద్దులను రక్షించుకోవడానికి భారత్ విపరీతంగా శ్రమిస్తోంది. అయినా ఇది భారత్‌కు సంబంధించిన విషయం’ అని అన్నారు. అయితే ఈ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది.

Comments

comments