Friday, March 29, 2024

స్టార్టప్‌లలో చైనా పెట్టుబడులే ఎక్కువ

- Advertisement -
- Advertisement -

China Investment in Indian Startups

 పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్‌లలో 18లో చైనా ఇన్వెస్ట్‌మెంట్

న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి తలపడడంతో పెద్ద సంఖ్యలో జవాన్లు అమరులయ్యారు. ఈ సమయంలో చైనా కంపెనీలు, ఆ దేశ పెట్టుబడులపై చర్చ మొదలైంది. గత ఐదు-, ఆరు సంవత్సరాల్లో భారతీయ కంపెనీలలో చైనా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇది భారత మార్కెట్లో చైనా పట్టును బలపరుస్తుందని భావిస్తున్నారు. ఉద్రిక్తతలు పెరగడం రెండు దేశాలకు హాని కలిగిస్తుంది. కాని భారతదేశం మరింత ప్రభావితం కావచ్చు. ఎందుకంటే పెద్దమొత్తంలో చైనా కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్ట డం ఇటీవల కాలంలో పెరిగింది. భారతదేశంలోని 30 స్టార్టప్‌లలో 18లో చైనాకు ప్రధాన వాటా ఉంది.

అనగా ఒక బిలియన్ డాలర్లు (రూ.7600 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి. నివేదిక ప్రకారం, చైనా కంపెనీలు 2014 సంవత్సరంలో భారతీయ కంపెనీలలో 51 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఇది 2019లో 1230 మిలియన్ డాలర్లకు పెరిగింది, అనగా 2014 మిఎచ్ 2019 మధ్య చైనా మొత్తం 5.5 బిలియన్ డాలర్లను భారతీయ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన చైనా కంపెనీలలో అలీబాబా, టెన్సెంట్, టిఆర్ క్యాపిటల్‌తో సహా అనేక పెద్ద కంపెనీలు ఉన్నాయి. టెన్సెంట్ భారతదేశంలో 19 కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. భారీగా పెట్టుబడులు పెట్టి న చైనా కంపెనీలలో టెన్సెంట్, షున్‌వీ క్యాపిటల్, షియో మి వంటి సంస్థలు ఉన్నాయి. ఇది కాకుండా అలీబాబా కూడా చాలా కంపెనీలలో పెద్ద పెట్టుబడులు పెట్టింది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 70% వాటా

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారత మార్కెట్‌పై పట్టు సాధించాయి. దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రూ .2 లక్షల కోట్లు. చైనా బ్రాండ్‌లు అయిన ఒప్పో, షియోమి, రెడ్‌మి వంటి సంస్థలు మొబైల్ మార్కెట్లో 70 శాతం కంటే ఎక్కువ వాటాను సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా రూ.25 వేల కోట్ల టెలివిజన్ మార్కెట్లో 45 శాతం చైనా బ్రాండ్ ఆక్రమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News