Home అంతర్జాతీయ వార్తలు ‘లీఎకో’ రికార్డు.. 31 సెకన్లలో 2లక్షల అమ్మకాలు..!

‘లీఎకో’ రికార్డు.. 31 సెకన్లలో 2లక్షల అమ్మకాలు..!

le-eco-smart-phones-image-dబీజింగ్ : చైనా ఎలక్ట్రానికి ఉత్పత్తుల సంస్థ లీఎకో తక్కువ కాలంలో స్మార్ట్ పోన్లను అమ్మి రికార్డు సాధించింది. 31 సెకన్లలోనే లీ1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కి 2,20,000 ఆర్డర్లు వచ్చాయని , దాంతో ఒక నెల వ్యవధిలోనే రెండు లక్షలకుపైగా హ్యాండ్‌సెట్లను అమ్మడం ద్వారా ఈ రికార్డు వచ్చిందని సంస్థ స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సిఒఒ అతుల్ జైన్ వెల్లడించారు. తమ సంస్థ ఫోన్లకు ఎక్కువగా ఫ్లాష్ సేల్ పెట్టడం, తయారీలో నాణ్యతపై ప్రధానంగా దృష్టి పెట్టడం, క్లౌడ్ సర్వీసులు తదితర కారణాల వల్లే ఈ విజయం సొంతమైందని సంస్థ డివైజెస్ సిఒఒ అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆర్డర్లను ప్లేస్ అయాన ఘనత కూడా తమ సంస్థకే చెందుతుందన్నారు.