Search
Wednesday 18 July 2018
  • :
  • :

భారత ఔషధాలపై సుంకాలు తగ్గింపు!

drugs

 చైనా సినిమా ప్రభావంతో ఒప్పందానికి ప్రాధాన్యత
 ప్రధానంగా క్యాన్సర్ ఔషధాలకు మార్గం సుగమం

బీజింగ్: భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై ముఖ్యంగా క్యాన్సర్ ఔషధాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అంగీకారం భారత్, చైనాల మధ్య కుదిరింది. భారత్ నుంచి తక్కువ ధర ఔషధాలను దిగుమతి చేసుకోవలసిన ప్రాధాన్యత గురించి లుకేమియా రోగిపై తీసిన ఓ చైనా చిత్రం ఎత్తిచూపిన కొన్ని రోజులకే ఈ అంగీకార విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అయితే చైనా మార్కెట్‌లో క్యాన్సర్ ఔషధాలను అమ్మేందుకు లైసెన్సులు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందా, లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చైనాలో ప్రతి ఏడాది 43 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు చైనా అధికారిక టివి ఛానెల్ పేర్కొంది. పాశ్చాత్య దేశాల కన్నా భారతీయ క్యాన్సర్ ఔషధాలు చౌక అయినందున చైనాలో బాగా డిమాండ్ ఉంది. ‘ఔషధాలపై సుంకాలు తగ్గించాలన్న అంగీకారానికి మేము వచ్చాము. ముఖ్యమైన వాటిని నేను సంబంధిత అధికారులకు సూచిస్తాను’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చుయింగ్ సోమవారం మీడియాకు చెప్పారు. ‘దిగుమతులను పెంచడం, క్యాన్సర్ నిరోధక ఔషధాలపై సుంకాలు తగ్గించడం వంటివి చైనాలో భారత్‌కు, ఇతర దేశాలకు అవకాశాలు పెంచుతుంది’ అని కూడా ఆమె చెప్పారు. 84 వందల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వ్యాపారంలో 51 వందల కోట్ల లోటును తగ్గించేందుకు చైనాలోని ఐటి, ఔషధ రంగాలను తెరవాలని చైనాను భారత్ చాలా కాలంగా కోరుతోంది.

Comments

comments