Search
Saturday 22 September 2018
  • :
  • :

చైనా పోలీసుల అదుపులో ఐదుగురు భారతీయులు

ARREST-2బీజింగ్: కాలేజీ విద్యార్థితో సహా ఐదుగురిని చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. కున్మింగ్ నగరంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి 27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోల్‌కతాలోని కిడర్‌పోర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. గంజాయి పాకెట్లను ల్యాప్‌టాప్ బాగుల్లో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తుండగా వీరిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే తమకు ఏ పాపం తెలియదని నిందితులు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వయసు 22 నుంచి 46 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడైంది. ఇదిలా ఉండగా మత్తు పదార్థాల అక్రమ రవాణాను చైనాలో తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. జూలైలో కొకైన్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జూలియానా లోపజ్ కు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Comments

comments