Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకలు ?

అలాంటిదేమీలేదన్న భారత్

Sea

బీజింగ్: తూర్పు హిందూ మహాసముద్రం ప్రాం తానికి చైనా 11 యుద్ధ నౌకలను తరలించినట్లు తెలుస్తోంది. కొన్ని సాధారణ యుద్ధ నౌకలు, ఓ భారీ యుద్ధ నౌక, 30 వేల టన్నుల యాంఫీబియస్ ట్రాన్స్‌పోర్ట్ డాక్, 3 ట్యాంకర్లు ఈ మహాసముద్రంలో ప్రవేశించాయని సమాచారం. ఈ వివరాలను చైనా న్యూస్ పోర్టల్ సైనీ. కామ్. సీఎన్ వెల్లడించింది. ఈ యుద్ధ నౌకలు, ఇతర సామగ్రి ని పరిశీలిస్తే భారతదేశం, చైనా నావికా దళాల మధ్య తేడా పెద్దగా లేదని స్పష్టమవుతుందని ఈ న్యూస్ పోర్టల్ తెలిపింది. వీటిని ఈ ప్రాంతంలో మోహరించడానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

అంతేకాకుండా వీటిని ఎప్పుడు మోహరించారు? ఎంత కాలం ఇక్కడ ఉంటాయి? అనే వివరాలను కూడా పేర్కొనలేదు. మాల్దీవులపై ఆధిపత్యం చెలాయించాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆసియా, తదితర ప్రాంతాలకు రవాణా సదుపాయాలను విస్తరించేందుకు చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ పథకంలో భాగస్వామి అయ్యేందుకు మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. చైనా యుద్ధ నౌకలు హిందూ సముద్రంలోకి ప్రవేశించాయన్న వార్తలను భారత నౌకాదళం కొట్టిపారేసింది. ఏ దేశ యుద్ధ నౌకలు కూడా తూర్పు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.

Comments

comments