Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పాక్‌కు చైనా ‘మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్’

missile

న్యూఢిల్లీ / బీజింగ్ : అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్(ఎంటిఎస్)ను చైనా,  పాకిస్తాన్‌కు అమ్మినట్లు సమాచారం. దీనికి సంబంధించి హాంకాంగ్‌కు చెందిన దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్(సిఎఎస్)కు కీలక పరిశోధకుడు జెంగ్ మెంగ్వానీ పేరునున కూడా కథనంలో ఊటంకించింది. ఇలాంటి సున్నితైమన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరొక దేశానికి చైనా ఎగుమతి చేయడం ఇదే తొలిసారని జెంగ్ అభిప్రాయపడ్డారు. అయితే ఎంటిఎస్ కోసం పాకిస్తాన్ చైనాకు ఎంత చెల్లించిందన్న దానిపై స్పష్టత లేదు. పాకిస్తాన్ క్షిపణి అభివృద్ధికి చైనా అత్యాధునిక సాంకేతికతను ఇవ్వనున్నట్లు ఆ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా తునాతునకలు చేసే సాంకేతికతను బ్రహ్మోస్ క్షిపణి అందుకుందని భారత రక్షణ శాఖ చేసిన ప్రకటన అనంతరం పాక్,- చైనాల మధ్య ఈ డీల్ కుదరడం గమనార్హం.  బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్. దీన్ని రష్యా-భారత్‌లు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. భూమి, వాయు, జల మార్గాల్లో ఎక్కడి నుంచైనా అతి సులువుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించొచ్చు. కాగా, పాకిస్తాన్‌కు ఇచ్చిన సాంకేతికత అసాధారణమైనది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఎఎస్) పేర్కొంది. కాగా, అత్యాధునిక ఆయుధాలను చైనా నుంచి పొందడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. గతంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, షార్ట్ రేంజ్ మిస్త్స్రల్స్‌ను చైనా నుంచి పాకిస్తాన్ అందుకుంది.

Comments

comments