Home అంతర్జాతీయ వార్తలు మసూద్ కు చైనా మద్దతు ?

మసూద్ కు చైనా మద్దతు ?

 

బీజింగ్: ఐక్యరాజ్యసమితిలో మరి కొద్ది గంటల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను తీవ్రవాది ప్రకటించే తీర్మానంపై భద్రతా మండలి సమావేశం కానుంది. మరోసారి ఆ తీర్మానాన్ని అడ్డుకుంటామని చైనా భావిస్తున్నట్టు సమాచారం. చైనాకు వీటో అధికారం ఉండటంతో గతంలో మూడు సార్లు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించొద్దని వెల్లడించింది. సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు మసూద్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పరిగణించాలని ఫ్రాన్స్, యుకె, అమెరికా ప్రతిపాదన తీసుకొచ్చింది. అందరికీ అమోదయోగ్యమైన పరిష్కారం ఉంటేనే తాను అంగీకరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికారి కాంగ్ పేర్కొన్నారు. మసూద్ ఆధ్వర్యంలో భారత్‌లో చాలా ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంటు, పఠాన్‌కోట్, ఉరి, తాజాగా పుల్వామా దాడి 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. చైనా మాత్రం ఎప్పుడు మసూద్‌ను వెనకేసుకొస్తుంది.

 

China’s Opposition to Global Terrorist of Masood

 

China’s Opposition to Global Terrorist of Masood