Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భారత్ తనను తానే కొట్టుకుంది

లడక్ సెక్టార్‌లో రోడ్ నిర్మాణంపై చైనా విమర్శ

China-Vs-Indiaబీజింగ్: సరిహద్దుల వద్ద లడక్ సెక్టార్‌లో రోడ్డు నిర్మాణానికి భారత్ ప్రయత్నాన్ని చైనా గురువారం నాడు ప్రశ్నించింది. ఆ సెక్టార్‌లోని పన్‌గోంగ్ సరస్సు సమీపంలో కొత్త రోడ్డు నిర్మాణాన్ని భారత్ చేపట్టడం ద్వారా తనను తానే కొట్టుకొందను వ్యాఖ్యానించింది. ఇంకా విభజన జరగని సరిహద్దు వెంబడి అటువంటి ప్రాజెక్టు చేపట్టడం శాంతి, సుస్థిరతలకు అనుగుణంగా లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఈ ప్రాజెక్టును గత వారం ఇరుదేశాల సరిహద్దు భద్రతా సైనికులు ఘర్షణపడిన పన్ గోంగ్ సరస్సు వద్ద నిర్మించడానికి భారత్ ప్రాజెక్టును ఇటీవల మంజూరు చేసిన విషయమై వ్యాఖ్యానిస్తూ ఆ చర్య శాంతి, సుస్థిరతలు కాపాడడానికి అనుగుణంగా లేదని విమర్శించింది. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక ఈ రోడ్డు ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది. మార్సిమిక్ లా నుండి హాట్ స్ప్రింగ్ వరకు ఈ రోడ్డును నిర్మించే ప్రాజెక్టుకు హోం శాఖ ఆమోదం పొందింది. ఆ ప్రాంతం పన్‌గోంగ్ సరస్సుకు వాయువ్య దిశగా 20 కి.మీ. దూరంలో ఉంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్‌ఒ) ఆ పథకాన్ని చేపట్టింది. గురువారం నాడు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియాంగ్ ఆ వార్తపై తీవ్రంగా ప్రతిస్పందించారు. భారత దేశం చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉందని హువా అన్నారు. చైనా రోడ్ నిర్మాణ పథకాన్ని భారత్ అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు.
పాక్‌ను మళ్లీ సమర్థించిన డ్రాగన్
ఆఫ్ఘనిస్థాన్‌లో అనుసరించడానికి నూతన వ్యూహాన్ని ఆవిష్కరించిన అమెరికా ఆ దేశంలో పాకిస్థాన్ కీలక పాత్రను గుర్తించాలని చైనా కోరింది. పాక్ నికార్సయిన భద్రతా ఆందోళనలను, సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలని కూడా చైనా కోరింది. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్‌తో చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త అలా అన్నారు. అన్ని సందర్భాల్లో మిత్ర దేశం పాక్‌ను వెనవేసుకువచ్చినట్లుగానే ఈ సారి కూడా చైనా పాక్‌ను సమర్థించింది. ఆ దేశ కౌన్సిలర్ యాంగ్ జీ చి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్‌ను కఠిన పదజాలంతో హెచ్చరించిన రెండు రోజులకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల స్వర్గధామంగా మారిందని పాక్‌ను ట్రంప్ విమర్శించి, ఉగ్ర గ్రూపులకు ఊతం మానుకోవాలని హెచ్చరించారు. టిల్లర్సన్‌తో బుధవారం యాంగ్ ఫొన్‌లో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

comments