Home ఆఫ్ బీట్ వీడియోలు హృదయ విదారకరం…!(వీడియో వైరల్)

హృదయ విదారకరం…!(వీడియో వైరల్)

Father Pawns Daughterబీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి తాను తిన్న భోజనానికి సరిపడా డబ్బులు చెల్లించలేక తన రెండేళ్ల కూతురుని రెస్టారెంట్ లో తాకట్టుపెట్టి వెళ్లిపోయాడు. ఈ హృదయవిదారకర సంఘటన దక్షిణ చైనాలోని గుయాంగ్డాంగ్ లోగల ఫోషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృష్యాల ఆధారంగా హోటల్ యాజమాన్యాన్ని స్థానిక మీడియా ప్రశ్నించగా…  సదరు వ్యక్తి తన రెండేళ్ల కూతురితో కలిసి రెస్టారెంట్ కు భోజనానికి వచ్చాడు. భోజనం చేసిన తరువాత హోటల్ సిబ్బంది అతనికి ఆరు యువాన్ల(రూ. 62) బిల్లు అయిందని తెలిపింది. కానీ, అతని వద్ద ఒక యువాన్(రూ.10) తక్కువగా ఉండడంతో చేసేదేమిలేక తనతోపాటు వచ్చిన కూతురును తాకట్టు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలియని చిన్నారి అమాయకంగా తన తండ్రి వెంట వెళ్లేందుకు యత్నించగా హోటల్ సిబ్బంది పాపను అడ్డుకుంది. తండ్రి కోసం చిన్నారి ఎడవడం కూడా కెమెరాల్లో రికార్డైంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, స్థానిక మీడియా రంగప్రవేశం చేయడంతో రెస్టారెంట్ యజమాని పాపను ఆ తరువాతి రోజు తండ్రికి అప్పగించాడు.

Chinese Father Pawns his 2year old Daughter to Restaurant